సీతకు గడువిక రెండె నెలలని
లొంగని తనకిక మరణమె శరణని
సీతకు బాగుగ భయమును చెప్పి
రాక్షసి మూకకు ఆజ్ఞలు ఇచ్చి
అక్కడనుండి మరలిన వెంటనె
కోపముతో ఎర్ర బారిన ముఖములు పొంది
అతి కర్కశముగ మాటలాడుతు
పరుగున వచ్చిరి సీతను చేరిరి
"బ్రహ్మ మానస పుత్రులు ఆర్వురు
జగమున వారిని పులస్యులందురు
నాల్గవ పుత్రుని విస్రవుడందురు
రావణుడతనికి పుట్టిన బిడ్డడె
అతనికి తగిన భార్యవు నీవు
అంగీకారము తెలిపి బ్రతుకుము
లేనిచొ చావు నీకిక తధ్యము"
ఏకజటను రాక్షసి వికృత ముఖముతొ
సీతను చూస్తూ భయము పెట్టెను
దేవతలెల్లరు అతనికి దాసులు
నీవే అతనికి తగిన దానవని
హరిజటను రక్కసి సీతతొజెప్పెను
ప్రఘశ అంతలొ అటుగా వచ్చి
రావణుడంతటి వీరుడు లేదు
అతనిని భర్తగ తప్పక గొనుమని
అతి దీనముగ రోదన చేసెడి
సీతను చూసి చెప్పదొడగెను
అంతలొ వికట ఆపై దుర్ముఖి
ఒకరొకరుగ సీతను చేరి
ఇచ్చపు రీతిగ వత్తిడి చేసిరి
Tuesday, April 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment